గోడకున్న పెద్ద గడియారం ఠంగ్… ఠంగ్ మంటూ పన్నెండు గంటలు కొట్టింది.
అంతలో హాలులోని లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి.
అందరూ చీకటిలోకి కళ్ళు చించుకుని చూస్తున్నారు.
కొద్ది క్షణాల్లోనే ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై రెడ్ బల్బ్ ఫోకస్ పడిండి.
అక్కడ ఉన్న అందరి కళ్ళు ఒక్కసారి మిరుమిట్లు గొలిపాయి.
ఆ స్క్రీన్ వెనక ఏదో భారీ ఆకారం కదిలినట్లనిపించింది. రెడ్‌లైట్ ఆరిపోయింది.
గ్రీన్ స్పాట్లెట్ ఫోకస్ పడింది.
అతని ఆకారం ఎవరికీ తెలియదు. అతని పేరూ తెలియదు. ఊరూ తెలియదు. కానీ అతనికి మాత్రం అందరి చరిత్రలూ తెలుసు. ఆ స్క్రీన్ కున్న రెండు రంధ్రాలలో నుండి అతని కళ్ళు అందరినీ తీవ్రంగా శోధిస్తూ ఉంటాయి.
అడుగడుగునా మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తివేసే సస్సెన్స్
తప్పక చదవండి!