చిన్నతనం నుండీ ఆత్మ, విశ్వం, మరియు ఆధ్యాత్మిక అంశాల పట్ల నాకు గమ్మతైన ఆసక్తి ఉండేది. మనమంతా కేవలం భౌతిక శరీరాలు కాదని, బహుళ పరిమాణ జీవులం అనే గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాను. ఈ నవల ద్వారా ఇంతకు మునుపెన్నడు లోతుగా చర్చించని ఎన్నో అరుదైన అంశాలను స్పృశించాను.
ఈ నవల ప్రధాన పాత్ర శశి శేఖర్, విశ్వం మన ఆలోచనల ప్రతిబింబమే అని గట్టిగా నమ్ముతాడు. ఊహించని విధంగా ఒక అసాధారణమైన శక్తిని ఎదుర్కొంటాడు.
మరి శశి దానిని సాధారణ మానవ మనస్తత్వంతో ఎదుర్కొనలేక శరణు వేడుతాడా? లేక తన మానవ మేధస్సు పరిమితులను ప్రశ్నిస్తూ, వాటిని దాటుకుని, నిక్షిప్తమైన ఓ అంతర్లీన దైవిక శక్తిని మేల్కొలిపి శాశిస్తాడా?
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ ఛూ మంతర్ కేళీ మీరు మనసారా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను.
సుస్మిత సానికొమ్ము
Reviews
There are no reviews yet.