Akshara BookHouse

Changhis Khan

250.00

ఛెంఘీజ్ఖాన్ ఒకనాటి ప్రపంచ విజేత. అయినా బానిసగా అతడు జీవితాన్ని ప్రారంభించాడు. ఛెంఘీజాన్ చరిత్ర తిరగబడ్డ ఒక బానిస కధ!
శత్రువుని వధించడం ద్వారా మాత్రమే శాంతిని సాధించగలం అని భావించిన ఒక తిరుగుబాటుదారుడి కథ!
ఎక్కడో కెరులిన్ జీవ జలధారలు ఆధారంగా పచ్చిక మైదానాల మీద బానిసగా బ్రతుకు ఈడ్చుతున్న బాలుడు, చైనా చక్రవర్తుల సింహాసనాన్ని అధిష్ఠించి, సమర్ఖండ్ ని జయించి పశ్చిమ సముద్రంలో కత్తులు కడుగుతాడని ఎవరూ ఊహించలేని చారిత్రక వాస్తవం!
అనవరత యాత్రలతో అతనిది ఒక మహాప్రస్థానం!
గోబీ ఎడారిని దాటించి, చైనా మహాకుడ్యాన్ని బ్రద్దలు కొట్టించి, తూర్పు యూరోపు గుండెల్ని ఘాతుకంగా వ్రయ్యలు చేయించిన ఆ ఆవేశం, ఆ తీక్షణత, ఆ క్రూరత్వం ఛెంఘీజాన్!
అతడు ఆకాశంలో ఒక సూర్యుడు, భూమిమీద ఒకే పాలకుడు ఉండాలని ఆశించాడు. అది సాధించాడు.
అంతటి ఆవేశం,స్పూర్తి, ఘనతసాధించటానికి అతనిఅంతరంగంలో రగిలిన అగ్నిజ్వాలలేమిటి?
వాటిని బహిర్గతం చేయటమే ఈ రచనకు ఆదర్శం!

0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop

    Select at least 2 products
    to compare