మసరిగ్గా పదకొండు గంటలకి భూపతి పక్కన ఫోన్ మ్రోగింది.
గొంతు. ‘సరిగ్గా ఐదింటికి నీ చావుకి ముహూర్తం పెట్టాను’ ఫోన్లో సీతారామయ్య
‘నన్ను చంపడానికి నువ్వు కాదు, నీ దయ్యం రావాలి’ భూపతి సవాలు.
“మరి ఇప్పుడు మాట్లాడుతున్నదెవరనుకున్నావ్?” అంది అవతలి గొంతు.
ఉలిక్కిపడ్డ భూపతి, ‘హలో, హలో” అన్నాడు కానీ అవతల కట్టయ్యింది.
ఫోన్లో వాకబు చేస్తే, సీతారామయ్య నిన్న సాయంత్రం ఐదుగంటలకే చనిపోయాడనీ, శవమింకా ఇంట్లోనే ఉందనీ, ఇంకోగంటలో దహనమనీ తెలిసింది.
సీతారామయ్య నిన్నే చచ్చిపోతే – ఈరోజు సీతారామయ్యనంటూ ఫోన్ చేసిందెవరు?
“దయ్యం ఓ భ్రమ. అది ఒకొక్కరికి ఒకోలా ఉంటుంది. కొందరికి దయ్యాలు మనిషిలా కనిపిస్తాయి. కొందరికది దయ్యం పనే అనిపించే సంఘటనలు జరుగుతాయి. కొందరిది కేవలం మానసికానుభూతి” అన్నాడు సైకియాట్రిస్టు జయశంకర్.
“ఫోన్లు రావచ్చా?” అనడిగితే రావచ్చన్నాడు.
సరిగ్గా ఒంటిగంటకి మళ్లీ భూపతి పక్కన ఫోన్ మోగింది….
‘ప్రేమే జీవితమనుకున్న సీతారామయ్య, ప్రేమను నాశనం చెయ్యాలనుకున్న భూపతి, ప్రేమకు న్యాయం చెయ్యాలనుకున్న మాలతి` వీరి విచిత్రమైన ముక్కోణపు ప్రేమకథలో ఊహకందని మలుపులు. ఉత్కంఠభరిత కథనం.
ఇది వసుంధర మార్కు మనోవిశ్లేషణాత్మక సస్పెన్స్ థ్రిల్లర్!