తొలిసారిగా అంగారక గ్రహంపై కాలు మోపే ప్రయత్నంగా మార్స్-2 అనే అంతరిక్ష నౌకను ప్రయోగించింది భారతదేశం.
విజయవంతంగా ప్రయోగింపబడిన మార్స్-2 అనూహ్య పరిస్థితులలో అంతరిక్షంలో అదృశ్యమయింది.
ప్రాణాలకు తెగించిన మన గూఢచారుల వలన శత్రు దేశాలయిన పాకిస్తాన్, చైనాలకు మార్స్-2 అదృశ్యంతో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది.
మార్స్-2ను అన్వేషించడానికై మరో అంతరిక్ష నౌకను ప్రయోగించాలని నిర్ణయించుకుంటారు శ్రీహరికోట రాకెట్ కేంద్రం అధికారులు.
అడుగడుగునా అంతరిక్ష నౌక ప్రయోగానికి అవరోధాలు కల్పిస్తారు శత్రుదేశ గూఢచారులు.
శత్రుదేశ గూఢచారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు మన గూఢచారులు.
డిటెక్టివ్ ధర్మేంద్ర సాహసోపేతమైన పరిశోధన వూపిరి పోస్తుందీ నవలకు.
అంతుచిక్కని సస్పెన్సుతో, అడుగడుగునా థ్రిల్లింగ్ కలుగ జేస్తూ, వూహించని ముగింపుతో మిమ్మల్ని ఏకబిగిన చదివిస్తుందీ నవల.
తప్పక చదవండి!