ఈ ఉషస్సంధ్యలో తొలిరేకువిచ్చిన ముద్దమందారంలా ప్రపంచాన్ని ఆశ్చర్యంతో చూచింది ఉదాయి. ఊహతెలిసి లోకాన్ని అర్ధం చేసుకునే నాటికే తల్లిదండ్రులు దూరమయినారు. ‘నా’ అనే స్వార్థం ఆడించే ఆనందాలన్నింటి నుంచి వంచితురాలయింది ఆమె.
బ్రతుకు ఎడారిలో ఎన్ని మజిలీలు!!
ఊహించని రీతిలో అద్భుత నాట్యరాణిగా రూపొందిన ఆమెకు లిచ్ఛవుల రాణి ఆమ్రవనాన్ని బహూకరించింది. ఆమె ఆమ్రపాలి అయింది.
అసూయాపరుల దుష్టతంత్రానికి ఆమె భవితవ్యం బలి అయి పోయింది. ఆకలిగొన్న దురాశాపరులు ఆమెను ఆశించారు. వేశ్య అని ముద్ర వేశారు.
బ్రతుకుభాండం బ్రద్దలయిపోయిందని భావించిన తరుణంలో కరుణాసింధువు అయిన బుద్ధదేవుడు ఆమెకు తన పవిత్ర కర కమలాలను అందించి బ్రతుకుని ఉద్దరించినాడు.
??
విశిష్టమయిన శైలిలో, సజీవపాత్ర చిత్రణతో లల్లాదేవి కలం నించి వెలువడ్డ మరో ఆణిముత్యం. తెలుగు సాహితికి మరో కలికితురాయి.