Akshara BookHouse

About Us

About

Akshara Book House

From the deep truths hidden in our ancient poetry to the gripping suspense of modern thrillers, every book carries a soul of its own. Every page holds a voice, a memory, and a world waiting to be discovered.
We are truly thrilled to welcome you all to our new digital home for Telugu literature.

Eswar and I have always believed that stories are the bridges between hearts. They connect strangers, carry emotions across generations, and keep cultures alive through words. Today, with that same belief, we are turning a new page in our journey.

We are happy to announce the launch of our online bookstore Akshara Book House.
A carefully curated space created for every book lover who searches for meaning, mystery, imagination, and magic in the Telugu language.

This dream didn’t happen overnight. We have spent months thinking, planning, discussing, and building this platform with one simple intention, to create a warm corner on the internet where Telugu books and readers can find each other. Whether you are looking for spine-chilling horror stories that keep you awake at night, edge-of-the-seat thrillers that make your heart race, thought-provoking literature, or timeless classics that stay with you forever, we have tried to bring them all together under one digital roof. But this bookstore is not just about selling books.

It is about celebrating stories.
It is about supporting writers.
It is about keeping the love for reading alive in a fast-moving world.

As we begin this journey, we truly need your support, encouragement, and love. Every share, every recommendation, and every book you pick from our store will help this small dream grow into a meaningful community for Telugu readers.
Welcome to Akshara Book House.
Let’s turn pages together.

మన పురాతన కవిత్వాల్లో దాగి ఉన్న లోతైన సత్యాల నుండి ఆధునిక థ్రిల్లర్ కథల ఉత్కంఠ వరకు, ప్రతి పుస్తకానికి తనదైన ఆత్మ ఉంటుంది. ప్రతి పేజీ ఒక భావాన్ని, ఒక అనుభూతిని, ఒక కొత్త ప్రపంచాన్ని మన ముందుకు తీసుకువస్తుంది. అందుకే ఈ రోజు తెలుగు సాహిత్యానికి ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫారంను మీ ముందుకు తీసుకువస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈశ్వర్ మరియు నేను ఎప్పటినుంచో ఒక విషయం నమ్ముతున్నాం ..
కథలు అనేవి మనుషుల హృదయాల మధ్య వంతెనల వంటివి. అవి మనుషులను దగ్గర చేస్తాయి… భావాలను తరాల మీదుగా తీసుకెళ్తాయి… మన సంస్కృతిని పదాల్లో నిలబెడతాయి.

ఆ నమ్మకంతోనే ఈ రోజు మా ప్రయాణంలో ఒక కొత్త పేజీని తిప్పుతున్నాం. మా ఆన్‌లైన్ బుక్‌స్టోర్ “Akshara Book House” ప్రారంభిస్తున్నామని ఆనందంగా తెలియజేస్తున్నాం. తెలుగు భాషలో అర్థం, రహస్యం, ఊహాశక్తి, మాయాజాలం వెతికే ప్రతి పుస్తకప్రియుడి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన పుస్తకాలతో రూపొందించిన ఒక చిన్న వేదిక ఇది.

ఈ కల ఒక్కరోజులో పుట్టింది కాదు. గత కొన్ని నెలలుగా మేము ఎంతో ఆలోచించి, ప్లాన్ చేసి, ఎంతో ప్రేమతో ఈ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించాం. తెలుగు పుస్తకాలు మరియు పాఠకులు ఒకే చోట కలుసుకునే ఒక అందమైన డిజిటల్ స్థలం కావాలనేదే మా ఉద్దేశ్యం.
మీకు రాత్రంతా నిద్రపోనివ్వని భయానక కథలు కావాలా…
ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ కథలు కావాలా…
లోతైన ఆలోచనలు కలిగించే సాహిత్యం కావాలా…
లేదా ఎప్పటికీ చిరస్మరణీయమైన క్లాసిక్స్ కావాలా…
ఇవన్నీ ఒకే డిజిటల్ గూటిలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నించాం.
కానీ ఈ బుక్‌స్టోర్ కేవలం పుస్తకాలు అమ్మే స్థలం మాత్రమే కాదు.
ఇది కథలను సంబరంగా జరుపుకునే వేదిక.
రచయితలను ప్రోత్సహించే ఒక ప్రయత్నం.
చదవడం అనే అలవాటును జీవంతో ఉంచే ఒక చిన్న ప్రయాణం.

— Sowmya Sri, Eswar

0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop