Akshara BookHouse

Lakumadevi

250.00

ఆశయాలకు అంకితమైన జీవితాలలో మనస్తాపాలు అనివార్యం. కళకు కావ్యాలకు జీవితాల్ని అంకితం చేసుకున్నవారు అదృష్టవంతులో దురదృష్టవంతులో తెలియదు కాని కన్నీటిని భరించటం నేర్చుకొని వుండాలి.
దక్షిణాపధ గత చరిత్రలో అందాల సువర్ణాధ్యాయం రెడ్డి రాజుల యుగం. సంగీత, సాహిత్య నాట్య శిల్పాది లలిత కళలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సంపన్నంగా అభివృద్ధి చెందిన బంగారు యుగమది. పాలకులు యుద్ధ వేదంతోపాటు నాట్య వేదాన్ని కూడా సమదృష్టితో ఆదరించిన కాలం.
కొమరిగిరిరెడ్డి సరసుడు. లకుమాదేవి అభాగిని, అనాధ. పుట్టగానే త్యజించబడి కమలయోగిని కంటిపాపగా పెరిగి నర్తకి అయింది. వికసించే అందాల పుష్పం వలె అందాలు సంతరించుకున్నది. తన నాట్య విలాసంతో ప్రభువు మనసు దోచుకొని అతని జీవితంలో వెన్నెలలు కురిపించింది.
కాటయ వేమారెడ్డి రాజ్యానికి వెన్నెముక వంటివాడు. సాహితీ సమ రాంగణాలలో సమ ప్రావీణ్యం కలిగి రెడ్డిరాజ్యపర్వం మహా వైభవానికి ప్రతీక అనదగినవాడు. కొమరగిరి బావమరిది.
రాజు వైవాహికజీవితంలో సహజంగానే సుడి చెలరేగింది. కాటయవేముని మనసు కలతపడింది. మరొక ప్రక్క రాజకీయాలు. వారి మధ్య చెలరేగిన సంఘర్షణ ఎలా ముగిసింది?
అంధ్రులు గర్వించదగిన చరిత్ర నిక్షిప్తమైన అధ్యాయం ఆధారంగా పాఠకుల మనసులను పరవశింపజేసే ఉదాత్త శృంగార వచన కావ్యం ‘లకుమాదేవి’. ప్రసన్న గంభీర శైలిలో ఆధ్యంతం రసార్ధమై చవులూరించే నవల.

0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop

    Select at least 2 products
    to compare