Akshara BookHouse

Mrutyu Keratam

120.00

అతను కొవ్వొత్తి వెలిగించి అగ్గిపుల్ల డస్ట్బిన్లో పడేశాడు. కొవ్వొత్తికి కట్టిన దారం కదలకుండా తలుపు జాగ్రత్తగా మూశాడు. బెడ్రూమ్లో మంచానికి కట్టేసిన ఏసుపాదం దగరకొచ్చి అతని కళ్లల్లో కదులుతున్న భయం గమనించి చిన్నగా నవ్వాడు.
“ఆ గదిలో కొవ్వొత్తి వెలుగుతుంది. అది పది నిమిషాలు వెలిగేసరికి దానికి కట్టిన దారం కాలి తెగిపోతుంది. దారానికి ఇటువైపు రాయి కట్టి ఉండటంతో అది తిన్నగా బెడ్లైట్ స్విచ్ మీద పడుతుంది. అప్పటికే ఈ గదంతా గ్యాస్ నిండి ఉండటం వల్ల లైటు వెలిగి గది పేలిపోతుంది. నీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి…” చెప్పి, అప్పటికే కిచెన్ నుంచి ఆ గదిలోకి తెచ్చిన గ్యాస్ సిలిండర్ ఆన్ చేశాడు. చిన్న చప్పుడుతో గ్యాస్ బయటికి రాసాగింది.
గింజుకుంటున్న ఏసుపాదాన్ని పట్టించుకోకుండా బయటకి నడిచాడతను.

Categories , ,
0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop

    Select at least 2 products
    to compare