“ఇప్పుడు నా దగ్గరకు ఓ కేసు వచ్చింది. ఒక అయిదేళ్ళ పాపకు మతి చలించిందంటూ నా దగ్గరకు తీసుకువచ్చారు. పాపను పరీక్ష చేశాను. ఆ పాప మానసికంగా పరిపూర్ణమైన ఆరోగ్యంగా వుంది. కానీ చేష్టలు, మాటలు చూస్తే, నాకే ఆశ్చర్యంగా వుంది. నాకు అర్థం కాలేదు” అన్నాడు డాక్టర్ రామ్. “ఎందుకు సంభవం కాదు డాక్టర్? సృష్టి ప్రారంభమైనప్పటి నుండి నేటివరకు శిశువు జననం విధానంలో ఏమైనా మార్పు వున్నాదా? లేదు. ఇదీ అంతే…” చెప్పుకుపోతున్నాడు ప్రొఫెసర్ జయరాం.
“ఎస్ డాక్టర్. ఎక్స్రే రిపోర్టును బట్టి అతనికి మతి కొంచెంగా చలించింది. బహుశా ఓ నెలరోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వుంటుంది. పెద్ద డాక్టర్లా చెప్పింది అక్కడికి పేషెంటుగా వచ్చిన అయిదేళ్ళ మంజు.
“1756 సంవత్సరంలో సింహళం నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువ గల బంగారంతో బయలుదేరిన ‘గోల్డ్ షిప్’ ఓడ సరిగ్గా ఈ మన్నార్ అఖాతంలో మునిగిపోయింది. అవునా?” అడిగాడు ప్రొఫెసర్ జయరాం.
“ఎస్..యు ఆర్ కరెక్ట్” చటుక్కున అన్నాడు బడా స్మగ్లర్ మస్తాన్.
అనుకోని సంఘటనలతో, ఊహించని మలుపులతో, అద్భుత సాహసాల సమాహారమే రమణశ్రీ కలం నుండి జాలువారిన ఈ ‘ప్రాక్టికల్ టెస్ట్’.
చదవండి! చదివించండి!!