సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలో మత్స్యకార గ్రామంలోని హాస్పిటల్లో మంచం మీద ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్న ముసలావిడ గంగమ్మ వైపు చూశాడు భరణి. అతన్ని అక్కడికి తీసుకొచ్చిన యువకుడు ముందుకి వంగి ముసలామెతో చెప్పాడు.
“అమ్మమ్మా! భరణి గారు వచ్చారు”
ఆ మాటకి ముసలమ్మలో ఎలాంటి స్పందన కనిపించకపోయే సరికి మరోసారి చెప్పాలని వంగిన ఆ యువకుడు చప్పున నిటారుగా నిల్చుని ఆశ్చర్యంగా చూడసాగాడు. అప్పటికే కళ్ళు తెరిచిన ముసలమ్మ మంచం చుట్టూ ఉన్న వారిని పరికించి భరణి మీద దృష్టి నిలిపింది. కొన్ని క్షణాలు ఆలాగే చూసి దగ్గరకు రమ్మన్నట్టు తలాడించింది. కాస్త ముందుకి జరిగాడు భరణి.
“నువ్వు రాజారావు కొడుకువేనా?” బలహీన స్వరంతో అడిగిందామె. “అవును..” చెప్పాడు భరణి.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
“రాజారావు నీ తండ్రి కాదు..”
ఎవరో ముఖం మీద బలంగా గుద్దినట్టు తుళ్ళిపడ్డాడు భరణి.
మరుక్షణం అక్కడ రోదనలు మొదలయ్యాయి.
ఇది మంజరి మార్క్ సస్పెన్స్ మిస్టరీ నవల.